ప్రస్తుత కాలంలో పదో తరగతి మార్కులకు( Tenth Class Marks ) ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు.పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తే మాత్రం ఇంటర్, డిగ్రీ, ఇతర పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని చాలామంది భావిస్తారు.
అయితే అత్తెసరు మార్కులతో పది పాసైన తుషార్ సుమేరా ప్రస్తుతం కలెక్టర్ గా పని చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ఇతని సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

తుషార్ సుమేరా( Tushar Sumera ) పదో తరగతి మార్క్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తక్కువ మార్కులు వచ్చినా ప్రతిభ ఉంటే పోటీ పరీక్షలలో సక్సెస్ సాధించడం సాధ్యమేనని తుషార్ సుమేరా ప్రూవ్ చేస్తున్నారు.1997లో తుషార్ సుమేరా పదో తరగతి పాస్ కాగా ఆయనకు కేవలం 49 శాతం మార్కులు వచ్చాయి.డిగ్రీ చదివిన తుషార్ డిగ్రీ పూర్తైన తర్వాత కొంతకాలం పాటు స్కూల్ టీచర్( School Teacher ) గా కూడా పని చేశారు.
ఒకవైపు స్టూడెంట్స్ కు పాఠాలు చెబుతూనే మరోవైపు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారు.2012 సివిల్స్ పరీక్షల ఫలితాల్లో( Civil Exams ) పాస్ కావడంతో పాటు తుషార్ ఐఏఎస్ గా ఎంపికయ్యారు.ఆ తర్వాత తుషార్ సుమేరా గుజరాత్ లోని భరూచ్ కలెక్టర్ గా( Bharuch Collector Tushar ) ఎంపికయ్యారు.ప్రతిభకు మార్కులు కొలబద్ధ కాదని ఆయన ప్రూవ్ చేశారు.
టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ దక్కుతుందని ఆయన ప్రూవ్ చేశారు.

తన సక్సెస్ స్టోరీ( Tushar Sumera Success Story )తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన తుషార్ సుమేర్ తక్కువ మార్కులు వచ్చినా పట్టుదలతో చదివితే సక్సెస్ సాధించడం సులువేనని ప్రూవ్ చేస్తున్నారు.తుషార్ సుమేరా కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ అయినా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు.కష్టపడితే ఎప్పటికైనా మంచి ఫలితం దక్కుతుందని తుషార్ సుమేరా ప్రూవ్ చేశారు.







