సోషల్ మీడియా( social media )లో సెలబ్రిటీలపై వచ్చే నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తరచూ ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ వారిపై దారుణంగా ట్రోల్లింగ్ చేయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు బూతులతో రెచ్చిపోయి విమర్శిస్తూ ఉంటారు.కొంతమంది సెలబ్రిటీలు చూసి చూడనట్టుగా వదిలేయగా మరి కొంతమందికి అలాంటి టోలింగ్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెబుతూ ఉంటారు.
ఇంకొందరు సెలబ్రిటీలు అటువంటి ట్రోలింగ్స్ విషయంలో విసిగిపోయి పోలీసులను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు.

తాజాగా కూడా ఒక స్టార్ హీరో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ పై పోలీసులను ఆశ్రయించారు.సోషల్ మీడియా వేదికగా తన గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తోన్న వారిపై మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్( Tovino thomas ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొంతమంది తనని అవమానించేలా, పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శనివారం రాత్రి ఆయన పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సంబంధిత సోషల్ మీడియా పోస్టులను సైతం కమిషనర్‌కు అందచేశారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న కమిషనర్.అనంతరం ఈ కేసును పనంగడ్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.కాగా 2021లో విడుదలైన మిన్నాల్ మురళి సినిమాతో టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు.సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో థామస్ డ్యూయల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.ఇక, ఈ ఏడాది ఆయన నటించిన 2018 మూవీ( 2018 movie ) తెలుగులోనూ విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది.2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.







