Raghu Karumanchi: టాలీవుడ్ కమెడియన్ రోలర్ రఘు కూతుళ్లని చూశారా.. ఎంత అందంగా ఉన్నారో?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.మేల్ కమెడియన్లు మాత్రమే కాకుండా ఫిమేల్ కమెడియన్స్ కూడా ఉన్నారు.

 Comedian Raghu Karumanchi Daughters Photos Goes Viral-TeluguStop.com

అయితే ఎక్కువ శాతం మేల్ కమెడియన్స్ ఉన్నారు.ఇక ఒక్కొక్కరు వారి స్టైల్లో సినిమాలలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు కమెడియన్గా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఇటువంటి వారిలో కమెడియన్ రఘు( Raghu Karumanchi ) కూడా ఒకరు.ఈయన పూర్తి పేరు రఘు కారుమంచి.

మొదట జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో టాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చిన రఘు అదుర్స్‌ చిత్రంతో( Adhurs Movie ) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాలలో విలన్ గా కమెడియన్గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రఘు.సినిమాలపై ఉన్న మక్కువతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల కోసం ప్రయత్నాలు చేశారు.డైరెక్టర్‌ వి.వి వినాయక్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్‌ చిత్రాల్లో( NTR ) అవకాశం లభించింది.అదుర్స్‌లో మంచి పాత్ర లభించడంతో రఘు( Comedian Raghu ) పేరు అందరికి రిజిస్ట్రర్ అయింది.

అలాగే జబర్దస్త్‌ కామెడీ షో( Jabardasth ) కూడా రఘుకి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పటివరకు దాదాపు 200పైగా చిత్రాల్లో నటించారు.అన్ని సినిమాలు చేసినప్పటికీ రఘుకి సరైన గుర్తింపు రాలేదు.ఒకనొక దశలో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి.

దీంతో రఘు లిక్కర్‌ దందాలోకి దిగాడు.

రెండేళ్ల కింద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్‌ షాపుల వేలంలో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్‌ సమీపంలో ఎండు దుకాణాలు చేజిక్కించుకున్నారు.రఘునే స్వయంగా పూజలు నిర్వహించి, మద్యం అమ్మకాన్ని ప్రారంభించారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రఘు పలు రకాల వ్యాపారాలు చేశాడు.

అతనికి స్టాక్‌ మార్కెట్‌పై మంచి పట్టు ఉంది.ఒక సమయంలో షేర్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు.

షేర్‌ మార్కెట్‌లో( Share Market ) భారీ నష్టం రావడంతో మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు.టెన్షన్‌తో ఇంట్లో ఉన్న కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ని పగులగొట్టాను అని చెప్పుకొచ్చారు.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా కమెడియన్ రఘు కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రఘుకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.పెద్ద కూతురు పేరు స్వప్నిక,( Swapnika ) చిన్న కూతురు పేరు తేజస్వీ.( Tejaswi ) సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రఘు తాజాగా తన చిన్న కూతురు ఫోటోలను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు.దీంతో రఘు కూతుర్ల ఫోటోలు నెట్టంట వైరల్‌గా మారాయి.రఘు ఇద్దరు కూతుళ్లు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.ఇద్దరు కూడా ఎంతో అందంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube