విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సమంత జంటగా నటించిన ఖుషి( Khushi ) సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా సమంత విజయ్ దేవరకొండ ఆటపాటలతో సందడి చేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో సింగర్ చిన్మయి( Chinmayi ).
పాల్గొని తన అద్భుతమైన గాత్రంతో ఎంతో అద్భుతమైన పాటలను ఆలపిస్తూ అందరిని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిన్మయి మాట్లాడుతూ.సమంత( Samantha )తో తాను ఎప్పటినుంచో మాట చెప్పాలనుకుంటున్నాను తన డబ్బింగ్ సమంతతోనే మొదలైందని ఈమె తెలియజేశారు.సామ్ ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందని ఈ ప్రపంచంలో ఎంతో ధైర్యవంతులు, మంచి మనసు, అందమైనటువంటి వ్యక్తులలో సమంత ఒకరని తెలియజేశారు.
ఎవరు ఏమనుకున్నా సమంత ఎప్పుడు కూడా నాకు బెస్టీ అంటూ ఈ సందర్భంగా చిన్మయి చెప్పడమే కాకుండా సమంత కోసం అమృతాలోని ఏ దేవి వరము నీవు అనే పాట పాడుతూ ఆమెకు డెడికేట్ చేశారు.

ఇలా తన గురించి చిన్మయి చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి సమంత కాస్త ఎమోషనల్ అవుతూ వేదికపైనే తనని హగ్ చేసుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోని సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ.
చిన్మయి పాప నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.ఖుషి మ్యూజికల్ నైట్( Khushi Musical Night )లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.
నీ మాటలతో ఆ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది.నీ మనసు ఎంత అందంగా ఉంటుందో అంతటి మధురమైన గాత్రాన్ని ఆ భగవంతుడు నీకు ఇచ్చాడు అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







