వైరల్: ప్రతి 6 నిమిషాలకు ఒక స్మార్ట్ ఫోన్ మాయం.. ఎక్కడంటే?

నేటిదైనందిత జీవితంలో సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది.చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లు కొలువు దీరాయి.

 Viral: Every 6 Minutes A Smart Phone Is Destroyed.. Where? Mobile Phone Thefts,-TeluguStop.com

చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే నామోషీగా ఫీల్ అయ్యేవారు ఇక్కడ చాలామంది వున్నారంటే అతిశయోక్తి కాదు.అవును, చేతిలో ఏం ఉన్న లేకున్నా స్మార్ట్ ఫోన్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.

ఎలాగంటే చాలామందికి అది శరీరంలో ఒక భాగం అయిపోయింది మరి.దీంతో ధర ఎంతైనా సరే వెచ్చించి స్మార్ట్ ఫోన్‌( Smartphone )లు కొంటున్నారు.

Telugu England, Latest, London, Phone Thefts, Tech-Telugu NRI

మరి విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్‌లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే దొంగ బాబులు మాత్రం ఎందుకు ఉరుకుంటారు.అందినకాడికల్లా దోచేసుకుంటున్నారు.అందకపోయినా కొన్ని చోట్ల లాక్కొని పోతున్నారు కూడా.ఎలాగంటే మీరు ప్రయాణంలో వున్నపుడు చేతితో ఫోన్లో ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు అనూహ్యంగా ఒకడు మీ ఫోన్ లాక్కొని వెళ్లిపోతుంటాడు.

ఒక్క క్షణంలో వారు కనుమరుగైపోతారు.ఇంకేముంది కట్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మీ ఫోన్.

ఇలాంటి ఘటనలు చాలానే వున్నాయి.స్మార్ట్ ఫోన్‌లను సెకండ్ హ్యాండ్‌లో అమ్మిన కూడా వారికి మంచి గిట్టుబాటు ధరే పలుకుతుంది.

దీంతో స్మార్ట్ ఫోన్‌లను దొంగిలించి వాటిని అమ్మితే వచ్చిన సొమ్ముతో దొంగలు దర్జాగా బతికేస్తున్నారు.

Telugu England, Latest, London, Phone Thefts, Tech-Telugu NRI

ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్‌ల దొంగతనాలు అనేవి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి.ఇక ఈ దొంగతనాల సంఖ్య లండన్‌లో మరి ఎక్కువగా ఉంది.ఎంతలా అంటే ప్రతి 6 నిమిషాలకు అక్కడ ఒక స్మార్ట్ ఫోన్‌ దొంగతనానికి( Mobile Phone Thefts ) గురవుతుంది అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు.మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.2022 సంవత్సరం మొత్తంలో లండన్‌( London )లో 90,864 స్మార్ట్ ఫోన్‌లు దొంగిలించబడ్డాయి.అంటే ఒక రోజుకు సగటున 250 స్మార్ట్ ఫోన్‌లు చోరీకి గురవుతున్నాయని కనుగొన్నారు.దొంగల వ్యక్తిగత దోపిడీలో ఫోన్ దొంగతనాలే అక్కడ 38 శాతం వరకు ఉన్నాయి.

గత సంవత్సరం లండన్‌లో జరిగిన దొంగతనాలలో దాదాపు 70 శాతం సెల్ ఫోన్‌లకు సంబంధించినవే అని గణాంకాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube