విదేశీ టూర్లకు ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

మనలో చాలామంది జీవితంలో ఒక్కసారైనా ప్రపంచాన్ని చుట్టి రావాలని కలలు కంటూ వుంటారు.దానికోసం ముందునుండే ఎంతోకొంత వెనకేసుకుని ఎప్పుడైనా వీలు చిక్కితే బయట దేశానికి వెళ్లి వస్తూ వుంటారు.

 Tax Collected At Source On Foreign Tour Packages Details, Foreign Tour, Travelin-TeluguStop.com

అయితే, ఇలాంటి పర్యటనలకు( Foreign Tours ) సొంతంగా వెళ్తే పర్వాలేదు గానీ, ఏదైనా సంస్థ ద్వారా ప్యాకేజీ మాట్లాడుకుని వెళ్తే మాత్రం విహారం కాస్త భారం కావడం ఖాయం.ఈ ఏడాది అక్టోబరు నుంచి అమలులోకి రానున్న కొత్త పన్ను విధానంలో పర్యటన ప్యాకేజీపై 20శాతం టీసీఎస్(ట్యాక్స్‌ కలెక్షన్‌ అట్‌ సోర్స్‌)ను చెల్లించాల్సి ఉంటుంది మరి.

Telugu Tcs, Foreign, Returns, Tax System, Package, Tax, Tax Source, Travel, Trip

ఇప్పటి వరకూ విదేశీ టూర్‌ ప్యాకేజీలకు 5శాతం పన్ను చెల్లిస్తూ వస్తున్నారు.ఇకనుండి అమలుకానున్న కొత్త విధానంలో పన్ను ఒక్కసారిగా 20శాతానికి( 20% TCS ) సర్కారు పెంచేసింది.ఉదాహరణకు ఒక విదేశీ పర్యటన ప్యాకేజీ విలువ రూ.5 లక్షలు అనుకుంటే, అదనంగా మరో రూ.లక్ష పర్యాటకులకు ఖర్చు అవుతుంది.విదేశీ పర్యటనలకు ఇది భారం అయినప్పటికీ.

దేశీయ పర్యాటకానికి మంచి ఊతం ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు.

Telugu Tcs, Foreign, Returns, Tax System, Package, Tax, Tax Source, Travel, Trip

అందుకే ఈ పన్ను భారంనుండి నుంచి తప్పించుకునేందుకు గాను కొంతమంది విదేశీ పర్యాటక సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు.అక్కడి వారి ద్వారానే విమాన టికెట్లు, హోటల్‌ గదులు, ఇతర బుకింగ్‌లు చేసుకుంటే టీసీఎస్‌ భారం తగ్గే అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణులు సలహాలు ఇస్తున్నారు.ఐటీ రిటర్నుల దాఖలు( IT Returns ) సమయంలో పర్యటన వివరాలను సమర్పిస్తే అందులో ఆ మొత్తం సర్దుబాటు జరిగేందుకు అవకాశం లేకపోలేదు.

కానీ ప్రతి రూపాయి కష్టపడి పోగేసుకునే మధ్యతరగతి మనిషికి ఆ అదనపు పన్ను( Income Tax ) మొత్తాన్ని కూడా ముందుగా సేకరించాల్సి ఉండటం మాత్రం ఇకనుండి పెను భారంగా మారనుంది.ఆ పన్ను మినహాయింపు పొందేందుకు సైతం ఏడాదిపాటు ఎదురుచూడక తప్పదు మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube