అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ( Mandapet Constituency )రైతులతో నిర్వహించిన “రచ్చబండ” కార్యక్రమంలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.జగన్ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.
ఇదే సమయంలో గోదావరి రైతులకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అని రైతులకు భరోసా ఇచ్చారు.జగన్ మద్యం షాపులు పెడుతున్నాడు నేను అధికారంలోకి వస్తే మళ్లీ అన్నా క్యాంటీన్ లు తీసుకొస్తా అని హామీ ఇచ్చారు.
పురుషోత్తపట్నం ప్రాజెక్టులో నీళ్లు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులు చాలామంది అప్పుల పాలయ్యారు.
రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట శాపంగా మారాయి.రైతులకు కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారా.? రాష్ట్రంలో ఆక్వా కల్చర్ వెంటిలేటర్ పై ఉంది అంటూ మండిపడటం జరిగింది.ఆరు నెలలలో జగన్ ప్రభుత్వం పోతుంది.
కరోనా సమయంలో వ్యవస్థలన్నీ మూలనపడ్డాయి.రైతుల మాత్రం వ్యవసాయం ఆపలేదు.
కాటన్ మహనీయుడు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మించారు.పోలవరం పూర్తయి ఉంటే సాగునీరు ఇంకా తాగునీరు పూర్తి స్థాయిలో అందేవి.
జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారు.వైసీపీ పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరు అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.







