బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..!!

ఈ ఏడాది దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగనున్న సంగతి తెలిసిందే.మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోరంగా ఓటమి చెందింది.

 Bjp Central Election Committee Meeting , Bjp, Modi, Amith Shah, Jp Nadda-TeluguStop.com

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం జరిగింది.ఈ పరిణామంతో ఇప్పుడు బీజేపీ పెద్దలు అలర్ట్ అయ్యారు.

ఈ ఏడాది మరికొద్ది నెలలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.దీనిలో భాగంగా బీజేపీ కేంద్ర ఎన్నికల భేటీ నేడు సమావేశం కావడం జరిగింది.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో( Amit Shah ) పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda )పాల్గొన్నారు.మధ్యప్రదేశ్, చత్తీస్ గాడ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

జరగబోయే ఈ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికతో పాటు.ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే అంశాలపై.

చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇంకా ఇదే సమావేశంలో మధ్యప్రదేశ్ సీఎం చౌహన్ సైతం హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే సమావేశానికి ఐదు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేతలతో పాటు ఎన్డీఏ భాగస్వామి పార్టీలు సైతం హాజరైనట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube