జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈరోజు ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ విడుదలైంది.ఎన్టీఆర్ ఈ సినిమాలో దేవర రోల్ లో కనిపించనుండగా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) భైరా రోల్ లో కనిపించనున్నారు.
దేవర సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాత కాగా కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సహ నిర్మాతగా ఉన్నారు.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సైఫ్ నటన వేరే లెవెల్ లో ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని నెలల క్రితం మొదలైన దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా పుష్ప2 సినిమా షూటింగ్ చాలా నెలల క్రితమే మొదలైనా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ సరిగ్గా రావడం లేదు.
ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో సైతం క్లారిటీ లేదు.బన్నీ ఫ్యాన్స్ ఈ విషయంలో తెగ ఫీలవుతున్నారు.ఇతర హీరోల సినిమాల నిర్మాతలను చూసి మైత్రీ నిర్మాతలు నేర్చుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏ మాత్రం సరైన ప్లానింగ్ లేకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎలా తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప1 మూవీ విడుదలై దాదాపుగా 20 నెలలు అయిన సంగతి తెలిసిందే.

పుష్ప1 సినిమాకు టార్గెట్లు పెట్టి అనుకున్న విధంగా షూటింగ్ పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకున్న బన్నీ పుష్ప2 మూవీ విషయంలో కూడా అదే విధంగా చేస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2( Pushpa 2 ) సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.ఎన్టీఆర్, బన్నీ కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







