డైరెక్టర్ శంకర్ పై ఫైర్ అవుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్... అదే కారణమా?

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ శంకర్ ( Shankar ) ప్రస్తుతం ఇండియన్ 2 ( Indian 2 ) , గేమ్ చేంజర్( Game Changer ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.రామ్ చరణ్ ( Ramcharan ) ద్విపాత్రభినయంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి గేమ్ చేంజర్.

 Ram Charan Fans Are Firing On Director Shankar Is-that The Reason, Shankar, Indi-TeluguStop.com

ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ పనులలో శంకర్ ఏంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా శంకర్ చేసిన పని కారణంగా రామ్ చరణ్ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శంకర్ తాను దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాల నుంచి అప్డేట్స్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే భారతీయుడు 2 సినిమా నుంచి కమల్ హాసన్ ( Kamal Hassan )కి సంబంధించిన స్టిల్ విడుదల చేశారు.దీంతో కమల్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే గేమ్ చేంజర్ సినిమా నుంచి మాత్రం ఆయన ఈ సినిమా వర్కింగ్ స్టిల్ కి సంబంధించిన ఫోటో విడుదల చేశారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులు శంకర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.భారతీయుడు 2సినిమా నుంచి కమల్ హాసన్ స్టిల్స్ విడుదల చేసినప్పుడు గేమ్ చేజర్ సినిమా నుంచి కూడా వర్కింగ్ స్టిల్ కాకుండా రామ్ చరణ్ కి సంబంధించిన ఏదైనా పోస్టర్ విడుదల చేయొచ్చు కదా అంటూ మండిపడుతున్నారు.

ఇలా గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ స్టిల్స్ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ మండి పడుతున్నారు.అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గత కొంతకాలంగా మేకర్స్ విడుదల చేయకపోవడంతో చరణ్ ఫాన్స్ కాస్త కోపంతో ఉన్నారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ శివారులో భారీ యాక్షన్ షెడ్యూల్స్ చిత్రీకరణ జరుపుకుంటుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube