వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో తెగుళ్ల, చీడపీడల బెడద( Pests ) చాలా ఎక్కువ.వీటివల్ల శ్రమతో పాటు పెట్టుబడి భారం అధికం అవటం వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది.
వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ల చీడపీడల బెడద విపరీతంగా పెరుగుతూనే ఉంది.వీటిని నివారించడం కోసం విచక్షణారహితంగా రసాయన పిచికారి మందులను ఉపయోగించడం వల్ల పంట నాణ్యత తగ్గుతుంది.
అయితే చీడపీడల బెడద తొలగడానికి పంటలలో వీటిని ఆకర్షించే ఎరపంటలను వేయడం వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉండదు.

సేంద్రీయ పద్ధతిలో సరైన మెళుకువలతో పంటలను సాగు చేస్తూ చీడపీడలను ఆశించే ఎర్ర పంటలను వేయడం వల్ల శ్రమతో పాటు పెట్టుబడి కూడా ఆదా అవుతుంది.పత్తి పంటకు( cotton crop ) శనగపచ్చ పురుగుల బెడద చాలా ఎక్కువ.అనవసర రసాయన పిచ్చికారి మందులు ఉపయోగించకుండా.
పత్తి పంటలో ఎర్ర పంటగా బంతి మొక్కలు నాటుకోవాలి.పత్తి పంటను పొగాకు లద్దె పురుగులు( Tar worms ) ఆశిస్తే వాటి నివారణ కోసం ఎర్ర పంటగా ఆముదం పంటను వెయ్యాలి.
పత్తి పంటలో మచ్చల కాయ తొలుచు పురుగులు, పచ్చ దోమలను నివారించాలంటే బెండ ను ఎర పంటగా వేసుకోవాలి.

మొక్కజొన్న పంటను ( Corn crop )ఆశించే తొలుచు పురుగులను అరికట్టడం కోసం జొన్న పంటను ఎరపంటగా వేయాలి.టమాటా పంటలో ఎర్ర పంటలుగా బంతి, ఆముదం పంటలను చేయడం ద్వారా పొగాకు లద్దె పురుగులను నివారించవచ్చు.క్యాబేజీ పంటలో ఆవాలును ఎరపంటగా వేసుకుంటే వివిధ రకాల చీడపీడల బెడద ఉండదు.
అయితే ఎర పంటను ఎన్నిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు గుర్తుంచుకోవాలి.ఎర పంటను పురుగు ఉనికికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి.
ఎర పంటలను ముఖ్య పంటలలో వేసినప్పుడు, ఎప్పటికప్పుడు పంట పొలాన్ని గమనిస్తూ ఉండాలి.







