యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్” (Salaar) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఇప్పటికే టీజర్ వచ్చి ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నెలలోనే ట్రైలర్ ఉందని మేకర్స్ తెలిపారు.
అయితే ఆగస్టులో ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ ఉంటుందో ఇంత వరకు క్లారిటీ లేదు.ఇక ఫస్ట్ సింగిల్ కూడా రాబోతుందంటూ గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ అది కూడా లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురు చుస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా సలార్ రెండు పార్ట్స్ గా రాబోతుందన్న విషయం తెలిసిందే.మరి పార్ట్ 1 రన్ టైం (Salaar Runtime) గురించి ఇప్పుడొక వార్త బయటకు వచ్చింది.
![Telugu Salaar, Adipurush, Hombale, Prabhas, Prabhas Fans, Prabhas Salaar, Prasha Telugu Salaar, Adipurush, Hombale, Prabhas, Prabhas Fans, Prabhas Salaar, Prasha](https://telugustop.com/wp-content/uploads/2023/08/Lengthy-runtime-for-Prabhas-Salaar-movie-detailss.jpg)
ఈ సినిమా పార్ట్ 1 నిడివి 3 గంటలకు పైగానే రావడంతో మేకర్స్ ఇందులో నుండి 10 నిముషాల మేర కట్ చేసి పార్ట్ 1 రన్ టైం ను ఫిక్స్ చేసారని.మొత్తంగా 180 నిముషాలు అంటే 3 గంటల నిడివితో రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
![Telugu Salaar, Adipurush, Hombale, Prabhas, Prabhas Fans, Prabhas Salaar, Prasha Telugu Salaar, Adipurush, Hombale, Prabhas, Prabhas Fans, Prabhas Salaar, Prasha](https://telugustop.com/wp-content/uploads/2023/08/Lengthy-runtime-for-Prabhas-Salaar-movie-detailsa.jpg)
సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అయిన ప్రభాస్ కు హిట్ ఇవ్వాలని మేకర్స్ కోరుకుంటున్నారు.ఆదిపురుష్ ( Adipurush ) వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.