గన్నవరం పై నిర్ణయం చెప్పేసిన వైసిపీ ! ఇక  'యర్లగడ్డ ' ఇష్టం 

గన్నవరం రాజకీయం గరం గరం గానే మారింది.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో ఈ నియోజకవర్గంలో రేగిన చిచ్చు ఇప్పటికి భగభగ మండుతూనే ఉంది.2019 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ( vallabaneni Vamsi )ఆ తరువాత ఆ పార్టీకి దూరమై వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వంశీనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జగన్ సైతం ప్రకటించారు.

 Ysp Who Decided On Gannavaram Like 'yarlagadda', Yarlagadda Venkatrao, Jagan, Ga-TeluguStop.com

దీంతో గన్నవరంలో తన పట్టు పెంచుకునే విధంగా వంశీ ప్రయత్నాలు చేస్తుండగా… 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు ,అలాగే మరో నేత దుట్టా రామచంద్ర రావు లు వంశీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Telugu Ap, Gannavaram, Jagan-Politics

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తానే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని యర్లగడ్డ వెంకట్రావు( Yarlagadda venkatrao ) ప్రకటించడం వంటివి కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వ సలహాదారు,  వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు.నిన్న విజయవాడ కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణారెడ్డి గన్నవరం వ్యవహారంపై తన మనసులో మాట బయటపెట్టారు.

యార్లగడ్డ  వెంకట్రావు ఎటు వెళ్ళాలనేది అతని ఇష్టం, ఒకరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చోట మరొకరికి సర్దుబాటు చేస్తాం అని సజ్జల అన్నారు.అలా కాదనుకుంటే వారి ఇష్టం.

ప్రజాస్వామ్యదేశంలో ఎవరు నిర్ణయాలు వారివి అంటూ పరోక్షంగా యర్లగడ్డ వెంకట్రావు అంశాన్ని సజ్జల ప్రస్తావించారు.అయితే యర్లగడ్డ మాత్రం తాను గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతానని,  వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని  చెబుతున్నారు .
‘rl

Telugu Ap, Gannavaram, Jagan-Politics

 కృష్ణాజిల్లా గన్నవరంలో అనుచరులు, కార్యకర్తలు, ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న యర్లగడ్డ గన్నవరం సీటు మళ్ళీ తనకే ఇవ్వాలని జగన్( CM jagan ) కోరుదామని చూస్తున్నా, రెండేళ్లుగా సీఎం అపాయింట్మెంట్ అడుగుతున్నా దొరకడం లేదని , తాను లేఖ రాసినా స్పందించడం లేదని,  ఎలాంటి పరిణామాలు జరిగినా, గన్నవరం నుంచి దిగాలని నిర్ణయించుకున్నానని ఇప్పటికే ప్రకటించారు .దీంతో గన్నవరం వ్యవహారం లో వైసీపీకి ముందు ముందు మరింత ఇబ్బందులు సృష్టించే విధంగా పరిస్థితి కనిపిస్తుంది .ఒకవేళ  వంశీకే వైసీపీ టికెట్ అధికారికంగా ప్రకటిస్తే.యర్ల గడ్డ వెంకట్రావు టిడిపి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇవే అనుమానాలు యర్లగడ్డ వెంకట్రావు వర్గంలో కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube