ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు దగ్గరగా వచ్చే కొద్దీ నాయకులు పోటీ చేసే స్థానాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడుతుంది.తెలుగుదేశం అధ్యక్షుడికి కుప్పం నియోజకవర్గం, వైసీపీ అధినేతకు పులివెందుల( Pulivendula ) ఆస్థాన నియోజకవర్గాలుగా కొనసాగుతున్నాయి.
జనసేన అధినేత( Janasena Leader ) ఇప్పటివరకు గెలవకపోవడంతో ఆయనకంటూ ప్రత్యేకమైన నియోజకవర్గం ఏర్పడలేదు.దాంతో వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది పెద్ద క్వశ్చన్మార్క్ గా మారింది.
జనసేన సానుభూతిపరులు మరియు సామాజిక వర్గ జనాభా అంటూ అనేక సమీకరణాలతో అనేక నియోజవర్గాల పేర్లు ఇప్పటివరకు వినిపించాయి ముఖ్యంగా తూర్పు గోదావరి నుండి పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలు , లేదా తిరుపతి నుంచి పోటీ చేస్తారు అంటూ అంచనాలు ఏర్పడ్డాయి .

అయితే వారాహి యాత్ర 3 విడత( Varahi Yatra ) పూర్తి అయ్యేసరికి జనసేనకు తమ బలమైన సీట్ల మీద ఒక అవగాహన వచ్చిందని కొత్త స్థానాల్ని నమ్ముకోవడం కంటే పాత స్థానాలలో తిరిగి పోటీ చేస్తేనే సింపతివేవ్ కలసి వచ్చి పవన్ గెలుస్తారని అంచనాలు ఏర్పడుతున్నాయట .ముఖ్యంగా వారాహి యాత్ర మూడో విడత యాత్రలో బాగం గా గాజువాకలో ఏర్పాటు చేసిన సభకు బారీ జన ప్రవాహం కనిపించింది.ఇప్పటివరకు వారాహి సభలు అన్నిటికంటే కూడా ఎక్కువ జనాభా ఈ సభకు పోటెత్తారు .దాదాపు రెండు లక్షల కు పైగా జనాభా హాజరు అవ్వడంతో గాజువాక ప్రజల లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పట్ల సానుభూతి కనిపిస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.నన్ను ఓడించిన బాదను ఈ జనప్రవాహాన్ని చూసి మర్చిపోయాను అని పవన్ వాఖ్యానించడం విశేషం.
దాంతో కొత్త స్థానాలను నమ్ముకోవడం కంటే తిరిగి పాత స్థానాల్లో పోటీ చేయటమే మంచిదని జనశెన బావిస్తున్నట్టు సమాచారం .

భీమవరం( Bhimavaram )లో కూడా కేవలం 6000 ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఈసారి పొత్తులు ఎలానూ ఉంటాయి కాబట్టి భీమవరం నుంచి పోటీ చేస్తే ఆయన విజయం నల్లేరుపై నడకే అన్న విశ్లేషణలు ఉన్నాయి.ఇప్పటివరకు జనసేన నుంచి అధికారికంగా పవన్ పోటీ చేస్తే నియోజకవర్గం పై ఎటువంటి అప్డేట్ రాకపోయినప్పటికీ పాట నియోజక వర్గాలను సీరియస్ గానే పరిశీలిస్తునట్టు సమాచారం
.






