మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) మరో ఫెయిల్యూర్ తో అవస్థలు పడుతున్నాడు.ఆచార్య తర్వాత వెంటనే గాడ్ ఫాదర్ సినిమా తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.
ఈ రేంజ్ విజయాన్ని మళ్లీ భోళా శంకర్ సినిమా తో దక్కించుకుంటాడు అంటూ అంతా కూడా భావించారు.ముఖ్యంగ మెగా ఫ్యాన్స్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు.
కానీ సినిమా మొత్తం తలకిందు అయింది.

ఏమాత్రం ఫలితం ను పాజిటివ్ గా రాబట్టలేక పోయింది.హీరో గా చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) లో మెగా ఫ్యాన్స్ కి ఇష్టం అయినట్లుగానే ఉన్నాడు.అయినా కూడా కమర్షియల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
ఆకట్టుకునే కథ మరియు కథనం లు సినిమాలో ఉన్నాయి.కానీ టేకింగ్ విషయం లో దర్శకుడు మెహర్ రమేష్( Director Meher Ramesh ) చాలా తప్పులు చేశాడు.
అందుకే భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.భోళా శంకర్ సినిమా హిట్ అయి ఉంటే ఇప్పటికే చిరంజీవి కొత్త సినిమా బ్రో డాడీ రీమేక్( Bro Daddy Remake ) పనులు మొదలు అయ్యేవి.
మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిన ఈ రీమేక్ ను కాస్త ఆపేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

దాంతో కొత్త ప్రాజెక్ట్ రావాలి అంటే చిరంజీవి అభిమానులు( Chiranjeevi Fans ) చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.కొత్త కథ విని ఓకే చేసి షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేయాలి అంటే కచ్చితంగా భారీ ఎత్తున సమయం పడుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ఇక చిరంజీవి విషయానికి వస్తే అనారోగ్యంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ గ్యాప్ లో ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని అంతా భావిస్తున్నారు.







