ఈ మధ్య కాలంలో హిందీ సినిమా లు రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి ఉంది.కరోనా కి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి.దాంతో చాలా మంది బాలీవుడ్( Bollywood Movies ) లో సినిమా ను విడుదల చేయడం కంటే డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేయడం ఉత్తమం అనే అభిప్రాయానికి వస్తున్నారు.
కరోనా పరిస్థితుల నేపథ్యం లో అప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీ కుదేలయ్యింది.ఇప్పటికి కూడా కోలుకోలేక పోతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న సినిమా లు కూడా వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తూ ఉంటే బాలీవుడ్ లో మాత్రం సూపర్ స్టార్ హీరోల సినిమా లు కూడా పదుల కోట్ల ను దాటడం లేదు.

ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమా… పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.అయినా కూడా 60 కోట్ల రూపాయలతో సినిమా నిలిచింది.ఇలాంటి సమయంలో సన్నీ డియోల్( Sunny Deol ) వంటి సీనియర్ హీరో వస్తుంది అంటే జనాలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు.కనుక ఆయన హీరోగా నటించిన గదర్ 2 సినిమా( Gadar 2 ) కి రూ.50 కోట్లు వచ్చినా గొప్ప విషయం అన్నట్లుగా ప్రచారం జరిగింది.కానీ అద్భుతం జరిగింది.గత చిత్రం గదర్ కి ఏమాత్రం తీసి పోకుండా భారీ వసూళ్లు నమోదు చేసింది.గతంలో వచ్చిన గదర్ సినిమా అప్పుడు పోటీగా ఉన్న లగాన్( Lagaan ) ను మించి వంద కోట్లకు పైగా వసూళ్లు చేయడం జరిగింది.

ఇప్పుడు ఏకంగా గదర్ 2 రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్( Gadar 2 Movie Box Office Collections ) వర్గాల వారు చెబుతున్నారు.ఈ రేంజ్ లో బాలీవుడ్ లో వసూళ్లు నమోదు అవుతాయి అని కనీసం ఊహించలేదు.
విడుదల అయిన రెండు రోజుల తర్వాత కూడా వంద కోట్ల వరకు వసూళ్లు నమోదు అవుతాయేమో అంతకు మించి వసూళ్లు వచ్చే అవకాశం లేదు అని చాలా మంది భావించారు.కానీ పరిస్థితి చూస్తూ ఉంటే ఏ రేంజ్ లో ఈ సినిమా దూసుకు పోతుందో అర్థం చేసుకోవచ్చు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్ల దిశగా సన్నీ డియోల్ గదర్ 2 సినిమా దూసుకు పోతోంది.







