పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ ( Janasena party )’వారాహి విజయ యాత్ర’ ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.రీసెంట్ గా వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఆయన నిర్వహించిన బహిరంగ సభ, అలాగే మొన్న గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మొదటి రెండు విడతల కంటే కూడా మూడవ విడత యాత్ర గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు.ముఖ్యంగా గాజువాక సభ కి అయితే గాజువాక లో ఉన్న జనాలు మొత్తం రోడ్ల మీద ఉన్నారా అన్నట్టుగా అనిపించింది.
ఆ స్థాయిలో జనాలు వచ్చారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడి జనాల ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రభుత్వం పై ఏ రేంజ్ కోపం లో ఉన్నారో అర్థం అవుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పర్యటన ముగించుకొని విజయవాడ కి వచ్చాడు.అయితే సభలు ఏర్పాటు చేసే ముందు పవన్ కళ్యాణ్ వైజాగ్ లో కొన్ని ప్రాంతాలను సందర్శించాడు.

రుషికొండ ని అక్రమంగా తవ్వేసి గ్రీన్ మ్యాట్స్ వేసిన దృశ్యాలను పవన్ కళ్యాణ్ తన ధ్రోన్ కెమెరా తో చిత్రీకరించి విడుదల చెయ్యడం పెద్ద చర్చకి దారి తీసింది.అలాగే పాయకరావుపేట సమీపం లో భూములను దోచేసి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం గురించి కూడా చెప్పుకొచ్చాడు.అయితే పవన్ కళ్యాణ్ కారణంగా నగరం లోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఎదురు అవుతున్నాయని, ఒక వ్యక్తి నిలదీసినట్టు సోషల్ మీడియా లో ఒక వీడియో తెగ ప్రచారం అవుతుంది.ఈ వీడియో లో పవన్ కళ్యాణ్ ఆవేశం గా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపించింది.
అతను పవన్ కళ్యాణ్ తో ఎదో చెప్పుకుంటున్నాడు.మాటలు వినిపించడం లేదు, దీంతో సోషల్ మీడియా లో ట్రాఫిక్ ఇబ్బందికి గురి చేసిన పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్న సామాన్యుడు అంటూ వైసీపీ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రచారం చేసుకుంది.

అయితే అసలు విషయం అది కాదు, గవర్నమెంట్ విధిస్తున్న పన్నుల గురించి ఒక సామాన్యుడు ఆవేదన తో చెప్పుకుంటున్నాడు.దానికి ఆడియో లేదు కాబట్టి ఇష్టమొచ్చిన కథనాలను అల్లేసి సోషల్ మీడియా లో రుద్దేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు.ఇకపోతే ఈ నెల చివరి నుండి పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు తన వారాహి యాత్రకి బ్రేక్ ఇచ్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని టాక్.ఎలా అయినా నవంబర్ లోపు షూటింగ్ ని పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో మూవీ టీం ఉన్నట్టుగా తెలుస్తుంది, చూడాలి మరి.







