టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో గాయత్రి గుప్తా ఒకరు.పలు సందర్భాల్లో వివాదాస్పద కామెంట్లు చేయడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా( Gayathri Gupta ) షాకింగ్ విషయాలను వెల్లడించారు.నాకు కమెడియన్, విలన్ రోల్స్ లో నటించడం అంటే ఇష్టమని గాయత్రి గుప్తా పేర్కొన్నారు.
ఒక మనిషిని తృప్తిగా నవ్వించడం ఇష్టమని ఆమె అన్నారు.నవ్వించడం, నవ్వగలగడం లక్ అని ఆమె తెలిపారు.నాకు సరైన గైడెన్స్ దొరకలేదని ఆమె చెప్పుకొచ్చారు.నేను తప్పు చేస్తున్నానో రైట్ చేస్తున్నానో అర్థం కాలేదని గాయత్రి వెల్లడించారు.
అబద్ధం చెబితే తాత్కాలికంగా సేఫ్ అయినా దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని ఆమె పేర్కొన్నారు.ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

చిన్నప్పుడు అబద్ధాలు చెప్పి పేరెంట్స్ చేతిలో దెబ్బలు తిన్నానని గాయత్రి గుప్తా అన్నారు.నేను ఎప్పుడూ హానెస్ట్ గా ఉంటాను కాబట్టి రిగ్రెట్ ఫీల్ కానని గాయత్రి వెల్లడించారు.నాకు రెమ్యునరేషన్ 14 నుంచి 15 లక్షల రూపాయలు రావాల్సి ఉందని ఆమె అన్నారు.నా దగ్గర అకౌంటబిలిటీ ఎవరూ లేరు కాబట్టి అలా చేశారని ఆమె అన్నారు.
ప్రస్తుతం ప్రతిదీ పేపర్ వర్క్ జరుగుతోందని గాయత్రి గుప్తా తెలిపారు.

ఐస్ క్రీమ్ సినిమాకు( Ice cream movie ) రూపాయి రెమ్యునరేషన్ కూడా లభించలేదని ఆమె కామెంట్లు చేశారు.వర్మ గారు ఒక్క రూపాయి కూడా పారితోషికం ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చారు.ఏమీ ఇవ్వలేకపోతామేమో అని చెప్పి ఆ సినిమా తీశారని గాయత్రి గుప్తా పేర్కొన్నారు.
ఒక సినిమా కోసం మూడేళ్లు పని చేస్తే 30,000 ఇచ్చారని ఆమె అన్నారు.సీత ఆన్ ది రోడ్ సినిమాకు రోజుకు 20,000 రూపాయల చొప్పున ఇచ్చారని గాయత్రి వెల్లడించారు.







