రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు న్యాత నవీన్( Nyata Naveen ) ఆధ్వర్యంలో పట్టణంలోని నంది చౌరస్తా వద్ద 76వ స్వాతంత్ర వేడుకలు( Independence Day ) ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం తో స్వాతంత్రం వచ్చి నేటికి 76 సంవత్సరాలు గడుస్తున్న పాలకుల అరాచకపు రాచరిక పాలనలో ప్రజలకు స్వాతంత్రం రాలేదని దుయ్యాబట్టారు.
రాభోయే రోజుల్లో యువకులు రాజకీయాల్లోకి రావాలని, యువతతోనే సమాజంలో మార్పు వస్తుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది యువకులు పాల్గొన్నారు.