సోషల్ మీడియా అభిమానులు డైలీ వాడే మాధ్యమాలలో షేర్ చాట్ యాప్( Share Chat ) ఒకటి.ఈ యాప్ ఎంత వేగవంతంగా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే.
దాన్ని వాడుతున్న వినియోగ దారులు మనలో కూడా చాలామంది వున్నారు.కేవలం వార్తలు మాత్రమే కాకుండా, ఇంస్టాగ్రామ్ లో ఉన్నట్టుగా రీల్స్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఈ షేర్ చాట్ యాప్ అనతికాలంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది.
అలాగే మన బంధుమిత్రులతో లైవ్ చిట్ చాట్ ( Live Chat ) కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు.దాంతోనే కోట్లాది మంది భారతీయులు షేర్ చాట్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు నేటికీ.

అయితే కాలం గడిచేకొద్దీ కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉంటాయని ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.ప్రతీ రోజు ఇదే యాప్ ని ఉపయోగించి బోర్ కొట్టిన వాళ్ళు దానికంటే బెటర్ యాప్స్ ఏముంటయా అని వెతుకుతూ ఉంటారు.అలాంటి వారి కోసమే ఈ సమాచారం.గూగుల్ ప్లే లో ఇక్కడ పేర్కొన్న యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.ఈ లిస్టులో మొదటిది “త్రిల్లర్ – సోషల్ వీడియో ప్లాట్ ఫార్మ్.”( Triller – Social Video Platform ) అమెరికా కి చెందిన కార్నీజ్ టెక్నాలజీస్, ప్రాక్సిమా మీడియా సంస్థలు సంయుక్తంగా కలిసి తయారు చేయించిన యాప్ ఇది.ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కోసం తయారు కాబడ్డ యాప్.

ఆ తరువాత చెప్పుకోదగ్గది “బోలో ఇండియా – షార్ట్ వీడియో యాప్.”( Bolo Indya – Short Video App ) ఈ యాప్ ని మన ఇండియన్స్ క్రియేట్ చేయడం కొసమెరుపు.తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఇలా ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయో, అన్నీ భాషల్లో కూడా యాప్ ఇపుడు అందుబాటులో కలదు.
ఇక్కడ కరెంట్ అఫైర్స్ , ఎంటర్టైన్మెంట్ , స్పోర్ట్స్, ట్రావెల్ , ఫుడ్ , హెల్త్ వంటి విభాగాలతో పాటుగా కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన విలువైన వీడియోలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.ఇక చివరగా మనం చెప్పుకోబోయేది “రోపోస్కో – ఇండియన్ షార్ట్ వీడియో యాప్” ఈమధ్య కాలంలో మంచి ప్రాచుర్యం పొందిన యాప్ ఇది.ఇండియాలో ఉన్న దాదాపు అన్ని ప్రాంతీయ బాషలలో ఈ యాప్ అందుబాటులో ఉంది.లేటెస్ట్ ట్రెండింగ్ ఆడియోస్ తో వీడియోలను క్రియేట్ అప్లోడ్ చెయ్యొచ్చు ఇక్కడ.
గూగుల్ ప్లే లో మంచి రేటింగ్ తో ట్రెండ్ అవుతున్న ఈ యాప్ ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.







