మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.
ఆ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసింది.ఆ తర్వాత వెంటనే భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తమిళ హిట్ మూవీ వేదాళం కు రీమేక్.అక్కడ సూపర్ డూపర్ హిట్ సాధించినప్పటికి ఇక్కడ డిజాస్టర్ అయింది.
చిరంజీవి చేయాల్సిన సినిమా కాదు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.

ఇక భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన భోళా శంకర్ కి నెగటివ్ టాక్ వచ్చిన నేపథ్యం లో తదుపరి సినిమాల విషయంలో చిరంజీవి ఆలోచనలో పడ్డాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ ని( Bro Daddy Movie ) తెలుగు లో రీమేక్ చేసేందుకు గాను ప్లాన్ చేశారు.అందుకే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
కొందరు మాత్రం మళ్లీ రీమేక్ అవసరమా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.బ్రో డాడీ సినిమా రీమేక్ రైట్స్ ను సుస్మిత కొణిదెల తీసుకున్నారు.

ఆమె ఈ సినిమాను చిరంజీవి, శర్వానంద్ తో( Sharwanand ) నిర్మించాలని భావించింది.హీరోయిన్ గా శ్రీలీల మరియు త్రిష నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.శర్వానంద్ ప్లేస్ లో డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.కనుక కచ్చితంగా ఈ రీమేక్ వస్తుంది అంటూ అంతా భావించారు.
కానీ భోళా శంకర్ సినిమా ఫ్లాప్ నేపథ్యం లో చాలా రకాలుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి.ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న హడావుడి నేపథ్యం లో బ్రో డాడీ రీమేక్ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.







