సూపర్ హిట్ సినిమాలు తీయడం లో మంచి పేరు సంపాదించుకున్న సూపర్ గుడ్ ఫిల్మ్స్( Super Good Films ) వాళ్ళు ఇప్పుడు సినిమాలు నిర్మించడం లో చాలా వరకు వెనకబడి పోయారానే చెప్పాలి ఒక్కప్పుడు వెంకటేష్ చిరంజీవి నాగార్జున లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన వీళ్ళు ఎందుకు ఇప్పుడు సినిమాలు ఎక్కువగా చేయడం లేదనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది…అయితే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల డేట్స్ అన్ని కూడా ప్రస్తుతం దిల్ రాజ్ ఒక్కడే బుక్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

అయితే సూపర్ గుడ్ ఫిలింస్ లో రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, సింహరాశి లాంటి చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అయినప్పటికీ మన హీరోలు కూడా అలాంటి వాళ్ళకి డేట్స్ ఇవ్వకుండా దిల్ రాజు( Producer Dil Raju ) లాంటి వాళ్ళకి ఇస్తు వాళ్ళతో వరుసగా సినిమాలు చేస్తున్నారు…దాంతో వీళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయి అని కొంతమందు ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…అయితే ఇదే విషయం మీద ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో( Producer Council ) ఈ విషయాల మీద మాట్లాడినప్పటికి హీరోలు తనకి డేట్స్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు కాదనాలి అని దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్స్ అనడం తో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఏమీ చేయలేక పోయింది…

అయితే ఒకప్పుడు సూపర్ హిట్స్ తీసిన ఈ బ్యానర్ మాత్రమే కాకుండా ఇంకా చాలా బ్యానర్స్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయారు మొత్తానికి ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ వల్ల సీనియర్ ప్రొడ్యూసర్స్ కి( Senior Producers ) చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదురు అవుతున్నాయి…ఇప్పటికైనా మళ్ళీ సీనియర్ ప్రొడ్యూసర్స్ వచ్చి వినియాలు ప్రొడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ట్రేడ్ పండితులు అంటున్నారు.








