సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ల ప్రతిభ తో చాలా సినిమాలు చేస్తుంటే కొందరు మాత్రం వాళ్ళకి వచ్చిన ఛాన్సులు వాడుకోవడం లో చాలా వరకు ఫెయిల్ అవుతూనే ఉంటారు అలాంటి దర్శకుల్లో మొదటి లిస్ట్ లో ఉండే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మెహర్ రమేష్( Meher Ramesh ) అనే చెప్పాలి ఈయన ఇప్పటికే 4 భారీ సినిమాలు తీస్తే అందులో మూడు భారీ ప్లాపులు కాగా ఒకటి యావరేజ్ గా ఆడింది ఇక దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ కి దూరం గా ఉన్న మెహర్ రమేష్ ఇప్పుడు చిరంజీవి తో చేసిన భోళా శంకర్( Bhola Shankar ) ప్లాప్ అయ్యింది…దాంతో మెహర్ రమేష్ మీద మెగా అభిమానులు చాలా కోపం గా ఉన్నారు…
ఇక ఇది ఇలా ఉంటే చాలా రోజుల నుంచి చిరంజీవి మోహన్ లాల్ వంటి ఇద్దరు పెద్ద హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయాల్సిన డైరెక్టర్ కి ఇది ఊహించిన దెబ్బ గా తయారైంది ఆ డైరెక్టర్ ఎవరంటే తరుణ్ భాస్కర్( Tarun Bhaskar ) అని తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత వీళ్ళిద్దరిీని పెట్టీ మల్టీ స్టారర్ సినిమా తీద్దామని అనుకున్నాడట కానీ ఇప్పుడున్న పొజిషన్ లో చిరంజీవి తరుణ్ భాస్కర్ కి ఛాన్స్ ఇస్తాడా.? అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…
నిజానికి చిరంజీవి( Chiranjeevi తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ ఎక్కడ కూడా రాలేదు కానీ వెంకీ కుడుముల( Venky Kudumula ) చేయాల్సిన సినిమా ప్లేస్ లోకి తరుణ్ భాస్కర్ వచ్చాడనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తోంది…అయితే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగక తప్పదు