1.టిడిపి పప్పులు అంటూ రోజా కామెంట్స్
టిట్కో ఇళ్ల దగ్గర టిడిపి పప్పులు వచ్చి సెల్ఫీలు దిగారని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
2.కెసిఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహారం ఉంది అని ఆయన ఎద్దేవా చేశారు.
3.పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు చేశారు.సభ్యత, సంస్కారం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మంత్రి మండిపడ్డారు.
4.తిరుమలలో ఎలుగుబంటి హల్చల్
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులను వన్య ప్రాణులు హడలెత్తిస్తున్నాయి.తాజాగా ఓ ఎలుగుబంటి శ్రీవారి మెట్లు మార్గం నుంచి వెళుతుండడం అక్కడి కెమెరాల్లో రికార్డు అయింది.
5. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది.అభ్యర్థుల ఎంపిక పై ప్రధానంగా చర్చించనున్నారు.
6.నేడు టీటీడీ బోర్డు సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు టిటిడి బోర్డు హై లెవెల్ కమిటీ భేటీ కానుంది.
7.వర్ష సూచన
తెలంగాణలో నేటి నుంచి వచ్చే మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
8.నేడు విద్యా శాఖ పై జగన్ సమీక్ష
ఏపీ సీఎం జగన్ నేడు తాడేపల్లి సమీక్ష చేయనున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి ,ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
9.ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు
దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు ఉపేంద్ర పై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
10.తిరుమల కొండపై బోనులో చిక్కిన చిరుత
తిరుమల అలిపిరి రోడ్డులో భార్యపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు బంధించారు.
11.టిడిపి మేడ్చల్ పార్లమెంటరీ విస్తృతస్థాయి సమావేశం
తెలంగాణ తెలుగుదేశం మేడ్చల్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అధ్యక్షతన మొదలైంది.
12.పవన్ కళ్యాణ్ కామెంట్స్
పార్టీ నడపడానికి సినిమాలే నాకు ఇంథనం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
13.బద్రీనాథ్ క్షేత్రంలో రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బద్రీనాథ్ లో బద్రీనాదుడిని దర్శించుకున్నారు.
14.మణిపూర్ అల్లర్ల కేసులు విచారించనున్న సిబిఐ
మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య చాలా రేగిన వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన తెలిసిందే.ఈ అల్లర్లపైన నమోదైన 9 కేసులను సిబిఐ అధికారులు విచారించరున్నారు.
15.ఢిల్లీలో భారీ వాహనాలపై ఆంక్షలు
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ కౌన్సిల్ అమలులోకి రానున్నాయి.నోయిడా, ఘజియాబాద్ ల నుంచి ఢిల్లీ వైపు వచ్చే భారీ వాహనాల ప్రవేశం పై సోమవారం రాత్రి నుంచి ఆగస్టు 15 వరకు ఆంక్షలు విధించారు.
16.కాంగ్రెస్ బిజెపిపై కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ బీజేపీలు అవినీతికి చిహ్నాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
17.పెలికాన్ సిగ్నల్స్ ప్రారంభించిన సీవీ ఆనంద్
పాదాచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి నగరం చుట్టూ ఉన్న పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆగాలని నగర పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్ కోరారు .ఈ మేరకు పెలికాన్ సిగ్నల్స్ ను ఆయన ప్రారంభించారు.
18.టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల నడక మార్గాలలో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి పెట్టింది.15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం రెండు వరకే నడక మార్గంలో అనుమతించనున్నారు.
19.కెసిఆర్ పై పొంగులేటి విమర్శలు
మాయ ప్రతి మాటలు నమ్మితే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
20.కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణలు
కమ్మ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని , చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వీడియో రిలీజ్ చేశారు.