నానిపై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఫ్యాన్స్.. చరణ్, ప్రభాస్, బన్నీ, తారక్ లను అవమానించావంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీ కలిగి ఉన్న హీరోలలో నాని ( Nani )ఒకరు.నాని నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఈ మధ్య కాలంలో దసరా సినిమా( Dasara Movie )తో నాని ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

 Netizens Trolling Hero Nani Details Here Goes Viral In Social Media , Allu Arju-TeluguStop.com

ఇతర హీరోల సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో పాల్గొంటూ నాని మంచి పేరు సంపాదించుకుంటున్నారు.అయితే నాని తాజాగా దుల్కర్ సల్మాన్ ను పొగుడుతూ కామెంట్లు చేశారు.

Telugu Allu Arjun, Dasara, Dulquer Salmaan, Kotha, Nani, Prabhas, Ram Charan, To

అయితే పొగిడే క్రమంలో నాని ఒకింత హద్దులు దాటడంతో టాలీవుడ్ సినీ అభిమానులు నానిపై ఫైర్ అవుతున్నారు.దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) నటించిన కింగ్ ఆఫ్ కోతా సినిమా( King of Kotha ) ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన నాని మనందరం పాన్ ఇండియా మూవీస్ అంటున్నామని ఆ పదం నాకు పెద్దగా నచ్చదని అన్నారు.అయితే నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దుల్కర్ మాత్రమే అని నాని అన్నారు.

నాని చేసిన ఈ కామెంట్లు టాలీవుడ్ ( Tollywood )సినీ అభిమానులకు చిరాకు తెప్పించాయి.

చరణ్, ప్రభాస్, బన్నీ, తారక్ లను నాని అవమానించడంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఈ హీరోలెవరూ నానికి పాన్ ఇండియా హీరోలుగా కనిపించలేదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

నాని అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారని మరి కొందరు చెబుతున్నారు.

Telugu Allu Arjun, Dasara, Dulquer Salmaan, Kotha, Nani, Prabhas, Ram Charan, To

మాట్లాడే మాటల విషయంలో నాని ఆచితూచి వ్యవహరించాలని ఇతర హీరోలను కించపరిచే విధంగా నాని మాట్లాడాల్సిన అవసరం ఏముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దుల్కర్ ను పొగడటంలో తప్పు లేదని అయితే ఇతర హీరోలను కించపరుస్తూ దుల్కర్ ను ప్రశంసించడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube