సాధారణంగా ప్రియులు ( Lovers ) తమ ప్రియురాలని కలిసేందుకు గోడ దూకడం లేదా వాటర్ పైప్‌పై పట్టుకొని ఇంటి పైకి ఎక్కడం, ఇంకా రకరకాల సాహసాలు చేస్తుంటారు.రొమాంటిక్ సినిమాల్లో చూపించిన దాని కంటే వీరు ఎక్కువ సాహసాలు చేస్తారనే చెప్పాలి.
ఒకవేళ అడ్డంగా దొరికితే తప్పించుకునేందుకు వారు ఏ మార్గమైనా ఎంచుకుంటారు.అయితే తాజాగా ఒక యువకుడు తన ప్రియురాలి గదికి వెళ్లాడు.
అదే సమయంలో ఆ ప్రియురాలి( Girlfriend ) కుటుంబ సభ్యులు రావడంతో బాల్కనీ గుండా దొంగచాటుగా బయటకు రావడానికి ప్రయత్నించాడు.ఒక వస్త్రంతో చేసిన తాడు ద్వారా అతడు కిందకి దిగడం మొదలుపెట్టాడు.
కానీ అప్పటికే ఆ ప్రియురాలికి సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్ ఇతడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నాడు.అనంతరం ఈ సీక్రెట్ లవర్‌ను ( Secret Lover ) పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
దాంతో సదరు ప్రియుడి పరిస్థితి చాలా దయనీయంగా మారింది.ఈ దృశ్యాలను ఎదురింటి వారు ఫోన్‌లో రికార్డ్ చేయగా అది కాస్త సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో తన గర్ల్ ఫ్రెండ్ కుటుంబ సభ్యుడి నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రియుడు ఒక వస్త్రం ద్వారా కిందకు జారుతూ కనిపించాడు.ఒక అంతస్తు కిందకి రాగానే ఒక మహిళ అతడిని బలంగా చీపురుకట్టతో( Broomstick ) కొట్టడం కనిపించింది.దీనికంటే ముందు ఆ గర్ల్ ఫ్రెండ్ అతడి బట్టలను కిందకు విసిరేసి త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడం కనిపించింది.మొత్తం మీద ఈ ప్రియుడిని సదరు కుటుంబ సభ్యులు పట్టుకున్నారో లేదో వీడియోలో కనిపించలేదు.

అయితే దీనిని రికార్డ్ చేసిన వారు మాత్రం తెగ నవ్వేసుకున్నారు.వీడియో చూసిన నెటిజన్లు కూడా అయ్యో పాపం అంటూనే ఫన్నీ కామెంట్లు పెట్టారు.@Enezator అనే ట్విట్టర్ లేదా ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఈ హిలేరియస్ వీడియోని మీరు కూడా చూసేయండి.







