ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు( AP Politics ) వాడి వేడిగా ఉన్నాయి.ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ( TDP )కి చెందిన చంద్రబాబు ఇంకా లోకేష్.
ఇప్పటికే పలు కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.ఇదే సమయంలో ప్రస్తుతం విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు.
ఒకపక్క చంద్రబాబు( Chandrababu Naidu ) మరొక పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో చంద్రబాబు ఇంకా పవన్ చేస్తున్న విమర్శలపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి( YCP Leader YV Subbareddy ) తాజాగా స్పందించారు.
వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.వారు ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేయడం జరిగింది.పేదవారికి సంక్షేమ పథకాలు అందటం వారికి ఇష్టం లేదని అన్నారు.గతంలో మహిళలకు ఇంకా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
.