అమెరికా( America )కు చెందిన 38 ఏళ్ల మహిళ అత్యంత పొడవైన గడ్డంతో రికార్డు సృష్టించింది.మీరు వింటున్నది నిజమే.
ఆడవాళ్లకు గడ్డాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.ఈ ప్రపంచంలో ప్రజలు వివిధ రకాల ప్రపంచ రికార్డులను నమోదు చేస్తారు.
ఆయా రికార్డుల ద్వారా ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందుతున్నారు.అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవాటి గడ్డం ఉన్న మహిళ కూడా ప్రపంచ రికార్డు సృష్టించిందని మీరు ఎప్పుడైనా విన్నారా? అమెరికాకు చెందిన ఎరిన్ హనీకట్ దాదాపు రెండేళ్లుగా గడ్డం పెంచుతోంది.ఇప్పుడు ఆమె జీవించి ఉన్న మహిళలలో పొడవైన గడ్డం కలిగిన ఉన్న రికార్డును అధికారికంగా బద్దలు కొట్టింది.
నిజానికి, ఎరిన్( Erin )కు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉంది.ఈ వ్యాధి బారిన పడిన వారిలో హార్మోన్ల సమతుల్యత చెదిరిపోతుంది.శరీరంపై అధిక మొత్తంలో జుట్టు పెరుగుతుంది.
ముఖ్యంగా అవాంఛిత రోమాలు శరీరంపై విపరీతంగా పెరుగుతాయి.ఇటువంటివి బాధితులకు చిరాకు కలిగిస్తాయి.
ఎరిన్ 13 సంవత్సరాల వయస్సులో ఆమె తన ముఖంపై జుట్టు పెరగడం గమనించింది.ముఖ్యంగా గడ్డం పెరుగుతూ వచ్చింది.
వాటిని ప్రతి రోజూ షేవింగ్ చేసేది.దీని వల్ల ఆమెకు అధిక రక్తపోటు( High blood pressure ) సమస్య తలెత్తింది.
దీని ప్రభావంతో చివరికి కంటి చూపునకు సంబంధించిన సమస్యలు ఏర్పడ్డాయి.రకరకాల క్రీములు వాడినా లాభం లేకపోయింది.దీంతో గడ్డం అలాగే వదిలేయాలని ఆమె భావించింది.అలా ఆ గడ్డం పెరుగుతూ వచ్చింది.ఇలా ఎరిన్ హనీకట్ గడ్డం 30 సెంటీ మీటర్లు అంటే 11.81 అంగుళాల వరకు పెరిగింది.దీంతో ప్రపంచ రికార్డు ఆమె పేరిట వచ్చింది.గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన 75 ఏళ్ల మహిళ వివియన్ వీలర్ పేరిట ఉంది.ఆమె గడ్డం పొడవు 25.5 సెంటీ మీటర్లు అంటే 10.04 అంగుళాలు.