తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఏడవ మైలు రాయి నుంచి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వరకు అధికారులు హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు.
భద్రతా సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.అదేవిధంగా వంద మందితో కూడిన భక్తుల బృందాలను అనుమతించనున్న టీటీడీ వారి వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత పులిని బంధించేందుకు మూడు బోన్లను ఏర్పాటు చేశారు.దాంతో పాటు నడక మార్గంలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టీటీడీ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే రెండు రోజుల కిందట నడకమార్గంలో వెళ్తూ మిస్సయిన చిన్నారి లక్షిత ఉదయానికి చిరుత దాడి చేయడంతో విగతజీవిగా మారిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
.






