మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బాట్( AI chatbot ) అయిన చాట్‌జీపీటీని డెవలప్ చేసి ఓపెన్ఏఐ సంస్థ బాగా పాపులర్ అయింది.ఇంకా అలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ఈ కంపెనీ ప్రయత్నం చేస్తుంది.
ఇందులో భాగంగా మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్రిటికల్ థింకింగ్‌లో నైపుణ్యం కలిగిన ఏఐ పరిశోధకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను నియమిస్తోంది.సరైన ప్రతిభ కనబరిచిన వారికి ఏడాదికి ఏకంగా రూ.3.7 కోట్ల శాలరీ అందిస్తామని కూడా ప్రకటించింది.ఈ జాబ్‌లకు దరఖాస్తు చేసుకునేవారు మెషిన్ లెర్నింగ్‌లో బాగా ప్రావీణ్యం, అద్భుతమైన కోడింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.AI భద్రతను పెరుగుపరచడానికి డెడికేటెడ్ గా వర్క్ చేయాలి.

ఈ జాబ్ ప్యాకేజీలో అన్‌లిమిటెడ్ టైమ్ ఆఫ్( Unlimited time off ), సంవత్సరానికి 18కి పైగా కంపెనీ హాలిడేస్, 20 వారాల పెయిడ్ పేరెంటల్ లీవ్, కుటుంబ-నియంత్రణ మద్దతు, సంవత్సరానికి 1,500 డాలర్ల విద్యా స్టైఫండ్ ఉన్నాయి.2025 నాటికి గ్లోబల్ AI మార్కెట్ విలువ 390 బిలియన్ డాలర్ల ఉంటుందని అంచనా.AIలో మంచి ప్రతిభ ఉన్నవారికి డిమాండ్ పెరుగుతోంది.
దీనర్థం AI నైపుణ్యాలు, అనుభవం ఉన్న వ్యక్తులు ఎక్కువ జాబ్ అవకాశాలే కాదు ఎక్కువ శాలరీలు కూడా లభిస్తాయి.

ఓపెన్ఏఐ సంస్థ ప్రస్తుతం రీసెర్చ్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అప్లైడ్ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ వంటి వారిని నియమించుకుంటుంది.ఓపెన్ఏఐ వెతుకుతున్న నైపుణ్యాలు, అనుభవం మీకు ఉంటే, వారి ఓపెన్ రోల్స్‌లో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు.మోడర్న్ AI రీసెర్చ్, అభివృద్ధిపై పని చేయడానికి, అధిక వేతనాన్ని సంపాదించడానికి ఇది గొప్ప అవకాశం.







