బుల్లితెర రాములమ్మగా యాంకర్ శ్రీముఖి( Sreemukhi ) బుల్లితెర ప్రేక్షకులతో మంచి పరిచయాన్ని పెంచుకొని వారిని అభిమానులుగా కూడా మార్చుకుంది.బొద్దుగా ఉన్నప్పటికీ కూడా తన హాట్ అందాలతో చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.
కేవలం బుల్లితెర షో లలోనే కాదు సినిమాలలో చేస్తుంది.ఖాళీ సమయం దొరికితే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తనను ఒక బుల్లితెర హీరో ఇష్టపడుతున్నట్లు తెలిసింది.ఇంతకూ అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రీముఖి.ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.
అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.తన యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.
ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.
గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.
సోషల్ మీడియా( Social media )లో మాత్రం ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను మతి పోగొడుతుంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.
ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.ఇక ఈ మధ్య పలు కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను యాంకరింగ్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
అందులో గుప్పెడంత మనసు, మరో సీరియల్ హీరో హీరోయిన్స్ వచ్చి బాగా సందడి చేసినట్లు కనిపించారు.అయితే శ్రీముఖి తను ఈ సెట్ లో అలిగాను అంటూ బుంగమూతి పెట్టుకున్నాను క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగా.
గుప్పెడంత మనసు హీరో ముఖేష్( Mukesh ) శ్రీముఖితో నా మనసులో మొత్తం మీరే ఉన్నారు అనడంతో వెంటనే శ్రీముఖి సిగ్గుతో తన బుగ్గలు ఎరుప్పెక్కాయి.మరి రక్ష అని శ్రీముఖి అడిగగా తను అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు అంటూ సరదాగా కామెంట్ చేశాడు.
ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.