తెలంగాణలో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.ఈ క్రమంలోనే తాజాగా మరో వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలను కోల్పోయారు.
ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నెలకొంది.
కారును రిపేర్ చేస్తూ జంగారెడ్డి అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు.
వెంటనే గమనించిన తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని సమాచారం.కాగా రిపేర్ చేస్తూ జంగారెడ్డి కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
జంగారెడ్డి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.