చిరంజీవి భోళా శంకర్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా తాజాగా భోళా శంకర్ సినిమా( Bhola Shankar Movie ) థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో అభిమానులు ఫీలవుతున్న సంగతి తెలిసిందే.

 Mahesh Babu Rejected Chiranjeevi Bhola Shankar Movie Details, Bhola Shankar, Mah-TeluguStop.com

భోళా శంకర్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.మెగా అభిమానులలో ఎక్కువ మందికి ఈ సినిమా నచ్చలేదు.

ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో మెహర్ రమేష్ ను( Meher Ramesh ) నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మెహర్ రమేష్ చిరంజీవి మంచి అవకాశం ఇస్తే చెత్త సినిమా తీశారని కామెంట్లు చేస్తున్నారు.భోళా శంకర్ టీం మాత్రం ఈ సినిమా రిజల్ట్ గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు.

చిరంజీవి సైతం కథల విషయంలో మారాల్సిన తరుణం ఆసన్నమైంది.ఈ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చేలా సినిమాలు తీసే దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది.

Telugu Acharya, Bhola Shankar, Meher Ramesh, Koratala Siva, Mahesh Babu, Chiranj

భోళా శంకర్ సినిమా కోలుకోవడం కష్టమని తేలిపోయింది.మెహర్ రమేష్ పై ఎన్ని ట్రోల్స్ చేసినా లాభం లేదని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భోళా శంకర్ సినిమాలో ట్విస్టులు కూడా ఆసక్తికరంగా లేవు.ఆచార్య( Acharya ) రిలీజ్ సమయంలో కొరటాలకు ఎదురైన విమర్శలే మెహర్ రమేష్ కు ఇప్పుడు ఎదురవుతున్నాయి.

చిరంజీవి రీమేక్ లకు( Remake ) దురంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Telugu Acharya, Bhola Shankar, Meher Ramesh, Koratala Siva, Mahesh Babu, Chiranj

సోమవారం నుంచి భోళా శంకర్ కు తిప్పలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఓవర్సీస్ లో సైతం భోళా శంకర్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh Babu ) మొదట ఈ సినిమాలో నటించే అవకాశం రాగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube