వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీని మూసేస్తాం..: బోండా ఉమ

వైసీపీకి భయపడే ప్రసక్తే లేదని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.నారా లోకేశ్ పాదయాత్ర చూసి వైసీపీకి భయం పట్టుకుందని విమర్శించారు.

 If Ycp Gets 175 Seats We Will Close Tdp..: Bonda Uma-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ ఇచ్చారని బోండా ఉమ తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు ఉండవని మంత్రి బొత్స అంటున్నారని చెప్పారు.

రెండు పార్టీలు ఉండవంటే హత్యకు ఏమైనా ప్లాన్ చేశారా అని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను ఓడిస్తామని తెలిపారు.

బొత్స ఫ్యామిలీతో సహా 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారన్నారు.వైసీపీ ప్రభుత్వానికి ధైర్యముంటే తక్షణమే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు.

వైసీపీకి 175కి 175 వస్తే తమ పార్టీనే మూసేస్తామని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube