చిరంజీవి అల్లు అర్జున్ మధ్య విభేదాలు.... అలా క్లారిటీ చేసిన బేబీ నిర్మాత?

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయం అందుకున్నటువంటి చిత్రం బేబీ( Baby ) .జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలనమైన విజయం సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

 Differences Between Chiranjeevi And Allu Arjun Baby Producer Made It So Clear, C-TeluguStop.com

ఈ సినిమా ద్వారా నిర్మాత ఎస్కేఎన్ ఎంతో మంచి లాభాలను కూడా అందుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి ( Chiranjeevi ) అల్లు అర్జున్ ( Allu Arjun )మధ్య ఉన్న మనస్పర్ధలు గురించి స్పందించారు.

Telugu Allu Arjun, Baby, Chiranjeevi, Skn-Movie

ఎస్ కే ఎన్( SK N ) చిత్ర పరిశ్రమలో ఏ స్థాయి నుంచి నిర్మాతగా మారారు అనే విషయాలను బేబీ సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ తెలియజేశారు.ఈయన మెగా ఫ్యామిలీకి వీరాభిమాని మెగా కాంపౌండ్ లో ఉన్నటువంటి హీరోలు అందరికీ కూడా ఈయన పిఆర్ గా పనిచేశారు.ఇలా మెగా ఫ్యామిలీని ఎంతో అభిమానించే ఈయన అల్లు అర్జున్ చిరంజీవి మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి మాట్లాడారు.

సోషల్ మీడియాలో ఈ వార్తలు గత కొంతకాలం నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయని తెలిపారు.

Telugu Allu Arjun, Baby, Chiranjeevi, Skn-Movie

నిజానికి అల్లు అర్జున్ చిరంజీవి మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవని తెలిపారు.అల్లు అర్జున్ అల వైకుంటపురం సినిమా వేడుకలను బేబీ సినిమా వేడుకలోను ఒకటే మాట చెప్పారు.నా కట్టే కాలే వరకు నేను చిరంజీవికి అభిమానిని అని తెలిపారు.

ఇలా అల్లు అర్జున్ చెప్పారు అంటే వారి మధ్య విభేదాలు ఎక్కడ ఉంటాయని ఈయన ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.చిరంజీవి అంటే ఎనలేని అభిమానం ఉందని,అయితే దానిని ఎప్పుడూ బయటపెట్టరు కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం మెగా హీరోలు అందరూ ఒకే తాటిపైకి వస్తారని ఎస్కేఎన్ ( SKN )తెలిపారు.

ఇక ఒక మెగా హీరో సినిమా వేడుక జరిగితే ఇతర హీరోలందరూ ఈ వేడుకకు రారు.అలా రావడంతో సొంత డబ్బా కొట్టుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే ఫ్యామిలీ హీరోల సినిమా ఫంక్షన్లకు మెగా హీరోలు రారని ఈయన తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube