నేటి దైనందిత జీవితంలో భార్యాభర్తలిద్దరూ పనిచేయకపోతే సంసారం గడవని పరిస్థితి వుంది.అందుకే ఇక్కడ చాలామంది భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ వుంటారు.
అలంటి సందర్భాల్లో తండ్రి లేదా తల్లి మాత్రమే వారి బిడ్డలను చూసుకోవల్సిన పరిస్థితి.లేదంటే పిల్లల పెంపకంపై ప్రభావం పడుతోంది.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం( Central Govt ) బుధవారం కీలక ప్రకటన చేసింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగం చేసే మహిళలు, ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒంటరి పురుషులకు (సింగిల్ మెన్) కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తీసుకు వచ్చింది.

అలాంటి పరిస్థితి కలిగిన స్త్రీలు 730 రోజుల శిశు సంరక్షణ సెలవులకు అర్హులని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ( Jitendra Singh )వెల్లడించారు.ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేయడం జరిగింది.కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్, ఇతర పోస్టులకు నియమితులైన మహిళా ప్రభుత్వోద్యోగులు, అదేవిధంగా ఒంటరి పురుష ప్రభుత్వోద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్, 1972లోని 43-C ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల మొదటి ఇద్దరు పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకూ సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజుల వ్యవధి సెలవులకు అర్హులు.
అయితే వికలాంగ పిల్లల విషయంలో వయోపరిమితి లేదని కూడా తెలిపారు.

ఇకపోతే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.2022లో తల్లులపై భారాన్ని తగ్గించేందుకు పితృత్వ సెలవులను పెంచాలని మహిళా ప్యానెల్ ప్రతిపాదించింది.సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్( Prem Singh Tamang ) ప్రభుత్వం తమ ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు, ఒక నెల పితృత్వ సెలవులను అందజేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలపడం గమనార్హం.
ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను, కుటుంబాలను మరింత మెరుగ్గా చూసుకునేందుకు ఈ ప్రయోజనం దోహదపడుతుందని సీఎం తమాంగ్ చెప్పారు.భారతదేశంలో తల్లిదండ్రుల సెలవు ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ద్వారా నిర్వహించబడుతుంది, ఇది పని చేసే మహిళలు 6 నెలల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తీసుకోవడానికి అనుమతిస్తుంది.







