కొన్ని జీవులు పర్యావరణానికి మంచి చేస్తే.మరికొన్ని జీవులు నష్టం చేకూరుస్తాయి.
కొన్ని జీవులు ఆర్ధిక నష్టాన్ని కూడా కలిగిస్తాయి.కొన్ని కీటకాల వల్ల ఆర్ధికంగా ప్రపంచానికి నష్టం జరుగుతుందట.
దీనికి సంబంధించి తాజాగా శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.కొన్ని జంతువులు తక్కువ ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తుండగా.
మరికొన్ని జంతువులు ఎక్కువ ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తున్నాయట.రెండు జాతులు మిగతా జీవుల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నట్లు గుర్తించారు.
అవే కప్ప, పాములు.

అమెరికన్ బుల్ ఫ్రాగ్ ( American bullfrog )అనే కప్ప, ట్రౌన్ టీ స్నేక్( Troun tea snake ) అనే పాముల వల్ల ప్రపంచానికి రూ.కోట్లల్లో నష్టం జరుగుతుందట.1986 నుంచి వీటి వల్ల ప్రపంచానికి రూ.కోట్లల్లో నష్టం జరిగినట్లు శాస్త్రవేత్తలు లెక్కలతో సహా వివరాలు బయటపెట్టారు.1986 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ రెండింటి వల్ల రూ.1,39,087 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.ఈ కప్ప, పాములు పంటలను నాశనం చేయడంతో పాటు పర్యావరణానికి ఎంతో నష్టం చేస్తున్నాయట.బ్రౌన్ ట్రీ స్నేక్ అనే పాము వల్ల రూ.81,750 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించారు. పసిఫిక్ దీవుల్లో( Pacific Islands ) సంచరించే ఈ పాములు విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి.

విద్యుత్ తీగలపైనుంచి జారి పడుతూ కోతలకు కారణమవుతున్నాయి.పసిఫిక్ దీవుల్లోనే 20 లక్షలపైగా ఈ పాములు ఉన్నట్లు అంచనా వేశారు.ఇక అమెరికన్ బుల్ ఫ్రాగ్ అనే కప్ప వల్ల నష్టం జరుగుతుంది.ఈ కప్ప తమ జాతికి చెందిన ఇతర కప్పలను కూడా తినేస్తుంది.30 సెంటిమీటర్ల పొడవు, అరకిలో వరకు బరువును ఈ కప్పలు కలిగి ఉంటాయి.ఇవి చేసే శబ్ధాల వల్ల సమీప ప్రాంతాల్లోని భూములను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.దీని వల్ల ఆర్ధికంగా కూడా నష్టం జరుగుతోంది.దీంతో ఈ కప్పులను నిరోధించడానికి ఫ్రాగ్ ఫ్రూఫ్ పెన్సింగ్ లనువేస్తున్నారు.ఇందుకోసం రూ.కోట్లల్లో ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి.








