కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి అహంకారం లేదు..: మోదీ

మహారాష్ట్ర, రాజస్థాన్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తోందని ఆరోపించారు.

 Bjp Does Not Have Pride Like Congress Party..: Modi-TeluguStop.com

వారసత్వ రాజకీయాలతో ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ ప్రధానులు కాలేకపోయారని మోదీ తెలిపారు.ప్రతిపక్షంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా వారసత్వ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించలేదని చెప్పారు.

అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలు తమకు ముఖ్యమని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి అహంకారం లేదన్నారు.

ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి రాజకీయాలు దేశానికే ప్రమాదకరమన్న మోదీ అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు భయపడలేదని తెలిపారు.

రాజస్థాన్ భవిష్యత్ ను మార్చేందుకు బీజేపీ అధికారంలోకి రావాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube