ఏపీలోని విద్యుత్ ఉద్యోగ సంఘాలు చర్చకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు చర్చలకు ఆహ్వానించింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ మరియు మంత్రుల కమిటీ చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటికే సీఎం జగన్ తో సబ్ కమిటీ సమావేశం ముగిసింది.
ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స చర్చించారు.ఈ క్రమంలోనే విద్యుత్ జేఏసీ నేతలను చర్చలకు పిలిచామన్న మంత్రి పెద్దిరెడ్డి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.







