కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు.ఈ క్రమంలో లోక్ సభలో స్పీకర్ కు రాహుల్ గాంధీపై ఫిర్యాదు అందింది.
కాగా రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.లోక్ సభ నుంచి వెళ్తూ రాహుల్ గాంధీ మహిళా ఎంపీలు కూర్చున్న వైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారంటున్న బీజేపీ మహిళా ఎంపీలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సభలో మహిళా సభ్యులను అవమానించడమే కాకుండా సభా గౌరవాన్ని దిగజార్చేలా రాహుల్ గాంధీ వ్యవహరించారని మండిపడ్డారు.







