బుల్లితెర లేడి కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ రోహిణి ( Rohini ) ఒకరు.బుల్లితెరపై పలు సీరియస్ లో నటిస్తున్నటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ (Jabardasth,) కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రోహిణి సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక్కసారిగా ఆస్పత్రిలో కనిపించారు.

తన కాలిలో రాడ్ ( Rod )ఉందని ఆ రాడ్డును తొలగించుకోవడం కోసం తాను సర్జరీ చేయించుకుంటున్నానని తెలిపారు.2016 వ సంవత్సరంలో విజయవాడలో తనకు ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో భాగంగా కాళ్ళకి సర్జరీ ( Surgery )చేసే రాడ్ వేసారని తెలిపారు.అయితే కాలిలో రాడ్ ఉండటం వల్ల తనకు డాన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఆ రాడ్ తోలగించుకోవడం కోసం సర్జరీ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా కాలికి సర్జరీ కావడంతో కొన్ని నెలల పాటు బుల్లితెరకు రోహిణి దూరమయ్యారు.
అయితే ఇప్పుడిప్పుడే ఈమె కోలుకుంటున్నారు.

ఇలాసర్జరీ తర్వాత తన ఆరోగ్యం కొంత కదటపడటంతో ఈమె స్టిక్స్ సహాయంతోనే బుల్లితెరపై పలు షోలలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే ఓ కార్యక్రమానికి ఈమె రవి ( Anchor Ravi ) కలిసి యాంకర్ గా సందడి చేశారు.అయితే వీల్ చైర్ ( Wheel Chair) లో కూర్చుని రోహిణి యాంకరింగ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే ఈ విషయంపై రోహిణినీ పలువురు నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.కాలు బాగా లేకపోయినా నిలబడలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇలా బుల్లితెర షోలకు కమిట్ అవడం అవసరమా ఇదంతా కేవలం డబ్బు కోసమే కదా…ఇలా వీల్ చైర్ లో కూర్చుని యాంకరింగ్ చేయడం ఏంటి విడ్డూరం కాకపోతే అంటూ భారీ స్థాయిలో నేటిజన్స్ ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.







