భోళా శంకర్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా రిలీజ్ కు ముందు ఈ సినిమాకు భారీ షాక్ తగులుతోంది.ప్రస్తుత పరిస్థితుల వల్ల భోళా శంకర్ మూవీ వాయిదా పడే అవకాశం అయితే ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏజెంట్ సినిమా హక్కులను కొనుగోలు చేసిన సతీష్ భోళా శంకర్ నిర్మాతలపై కేసు పెట్టడంతో పాటు భోళా శంకర్ మూవీ( Bhola shankar ) రిలీజ్ ఆపాలని కోరడం గమనార్హం.
సతీష్( Sathish ) మాట్లాడుతూ ఏజెంట్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిషోర్ తనను మోసం చేశారని సతీష్ వెల్లడించారు.
వాళ్లు చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలియాలని సతీష్ చెప్పుకొచ్చారు.ఐదేళ్ల పాటు ఏజెంట్ సినిమాకు సంబంధించిన ఏపీ, తెలంగాణ, కర్ణాటక హక్కులు నాకేనని చెప్పి 30 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆయన కామెంట్లు చేశారు.
నాకు కేవలం వైజాగ్ హక్కులు మాత్రమే ఇచ్చి అగ్రిమెంట్ బ్రేక్ చేశారని ఆయన పేర్కొన్నారు.
తాను గరికపాటి కృష్ణకిషోర్ ను కలవగా ఆయన అనిల్ సుంకరతో మాట్లాడి ఏజెంట్ డిజాస్టర్ అయినందుకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో నేను వైజాగ్ వెళ్లిపోయనని సతీష్ అన్నారు.సామజవరగమన వైజాగ్ రైట్స్ నాకు ఇచ్చారని ఆ సినిమాతో కొంత మొత్తం కవర్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.భోళా శంకర్ రిలీజ్ కు 15 రోజుల ముందు మిగతా మొత్తం ఇస్తామని చెప్పారని సతీష్ వెల్లడించారు.
ఈ విషయమై మాట్లాడాలని అనిల్ సుంకర( Anil Sunkara )ను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన నాకు సమాధానం ఇవ్వలేదని సతీష్ చెప్పుకొచ్చారు.ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టుకు వెళ్లానని ఆయన పేర్కొన్నారు.సతీష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భోళా శంకర్ మూవీకి ఇబ్బందులు ఎదురవుతాయో లేదో స్పష్టత రావాల్సి ఉంది.