ఏపీలో అధికార వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా అధికారంపై గట్టిగానే కన్నెసింది.ఈసారి ఏకంగా 175 స్థానాల్లో విజయం సాధించాలని తిరుగులేని టార్గెట్ తో ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ స్థాయి విజయం కోసం జగన్ తీసుకునే నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందనే చర్చ గత కొన్నాళ్లుగా జరుగుతోంది.ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో జగన్ ప్రణాళికలపైనే అందరి దృష్టి నెలకొంది.
కాగా ఈ సారి ఎన్నికల్లో కొంతమంది సీనియర్స్ ను పక్కన పెట్టె ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా అవంతి శ్రీనివాస్( Avanthi Srinivasa Rao ) అంబటి రాంబాబు( Ambati Rambabu ) వంటివారికి ఈసారి సీటు ఇవ్వాళ వద్దా అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట.
వీరిద్దరిపైన గత కొన్నాళ్లుగా ఏదో ఒక వివాదం చుట్టూ ముడుతూనే ఉంది.
గతంలో పలువురి మహిళలతో వీరిద్దరు జరిపిన రాసలీలలా సంభాషణలు పెను దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే.దాంతో అప్పటి నుంచి వీరిద్దరిపై తరచూ ఆ రకమైన విమర్శలు లేవనెత్తూన్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.ఈ ప్రభావం ఎటొచ్చీ వైసీపీని గట్టిగానే ఇబ్బంది పెడుతోంది.
అందుకే అధినేత జగన్( CM jagan ) వీరిద్దరి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంబటి రాంబాబుకు మరియు అవంతి శ్రీనివాస్ లకు టికెట్ ఇవ్వకపోవడమే మంచిదనే ఆలోచనలో జగన్ ఉన్నారట.
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి నియోజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ఈసారి ఆ నియోజిక వర్గంలో అంబటి గెలిచే అవకాశాలు కూడా తక్కువే అని సర్వేలు చెబుతున్నాయి.
ఇక భీమిలి నియోజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ ( Avanthi Srinivasa Rao )పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.అందుకే వీరిద్దరికి టికెట్లు ఇచ్చి రిస్క్ లో పడే కన్నా.టికెట్లు కేటాయించకపోవడమే మంచిదనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వినికిడి.అయితే ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే వీరిద్దరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అంటే చెప్పలేని పరిస్థితి.అంబటి రాంబాబు సంగతి అలా ఉంచితే అవంతి శ్రీనివాస్ పార్టీ మారిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన, 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసిన అవంతి 2014 లో టీడీపీ పార్టీలో ఉన్నారు ఆ తరువాత 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలిలో గెలిచారు.ఆ రకంగా చూస్తే సీటు దక్కకపోతే పార్టీ మారిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన.
మొత్తానికి అవంతి శ్రీనివాస్ మరియు అంబటి రాంబాబు లకు జగన్ స్ట్రోక్ తప్పేలా లేదని కొందరి అభిప్రాయం.