ఈ సుగంధ ద్రవ్యం ఖరీదు కేజీ రూ.3 లక్షలు.. ఎందుకంత స్పెషల్ అంటే..?

భారతదేశంలోని వాతావరణం సుగంధ ద్రవ్యాల సాగుకు అనుకూలమైనది.ఎన్నో అరుదైన సుగంధ ద్రవ్యాలు భారత్ లో పండిస్తూ ఉంటారు.

 The Price Of This Spice Is Rs. 3 Lakh Per Kg Why Is It So Special , Kashmir, Sha-TeluguStop.com

వేడి తీవ్రత తక్కువగా ఉండే ప్రాంతాలు అరుదైన సుగంధ ద్రవ్యాల సాగుకు అనుకూలమైనవిగా చెప్పవచ్చు.ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి.

దీంతో భారత్ లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి.తేయాకు, మసాలా( Tea, spice ) దినుసుల పంటల ద్వారా రైతులకు ఆదాయం కూడా బాగానే వస్తుంది.

అయితే సుగంధ ద్రవ్యాల్లో ఖరీదైనది ఏదైనా ఉందంటే కుంకుమ పుప్వు అని చెప్పవచ్చు.

Telugu Lakhs, Kashmir, Latest, Shafrron-Latest News - Telugu

చల్లని ప్రాంతమైన కశ్మీర్‌లో కుంకుమపువ్వు( Saffron in Kashmir ) పడుతుంది.ఏకంగా బంగారం ధరలతో ఇది పోటీ పడుతుంది.కశ్మీర్ లోయలో కొద్ది నెలల సమయంలో ఇది సాగు అవుతుంది.దీని రంగు, రుచి, వాసన అన్ని రకాల కుంకుమపువ్వుల కంటే గొప్పగా ఉంటాయి.అందుకే కాశ్మీర్ కుంకుమపువ్వులకు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటుంది.వీటికి జియో ట్యాగ్ కూడా ఉండటంతో మరింత పాపులర్ అయింది.

ప్రపంచ దేశాలకు కశ్మీరి కుంకుమపువ్వు ఎగుమతి అవుతూ ఉంటుంది.యూకే, కెనడాతో పాటు మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు ఎగుమతి అవుతాయి.

Telugu Lakhs, Kashmir, Latest, Shafrron-Latest News - Telugu

తాజాగా ఈ సుగంధ ద్రవ్యం దినుసు ధర 64 శాతం పెరిగింది.ఒక్క కిలోనే రూ.3 లక్షల వరకు పలికింది.వీటికి ఆయుర్వేద గుణాలు చాలా ఉన్నాయి.దీంతో ఔషధాల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.కశ్మీర్ కుంకుమపువ్వులను కేసర్, శాఫ్రాన్ అని పిలుస్తూ ఉంటారు.వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా కశ్మీర్ కుంకుమపువ్వు ఇండియాలోనే అత్యంత విలువైన సుగంధ ద్రవ్యంగా అవతరించింది.

గతంలో వీటి ధరలు చాలా తక్కువగా ఉండేవి.కానీ ఇప్పుడు ఎగుమతులు పెరగడంతో ధరలు ఆమాంతంగా పెరిగిపోయాయి.

జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube