బ్యాచిలర్ లైఫ్‌లు ఇలా ఉంటాయా..? అర్థరాత్రి 12 గంటల తర్వాత ఏం చేస్తున్నారంటే..?

ఉద్యోగం కోసం లేదా కోచింగ్ కోసం యువకులు తమ సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి సిటీలకు వెళుతూ ఉంటారు.ఉద్యోగం సంపాదించి సిటీలలోనే స్థిరపడిపోతారు.

 Are Bachelor Lives Like This What Are You Doing After 12 Midnight , Bachelor Li-TeluguStop.com

అయితే సిటీలకు వెళ్లినప్పుడు కొంతమంది హాస్టళ్లల్లో, మరికొంతమంది స్నేహితులతో కలిసి రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉంటూ ఉంటారు.ఇలాంటి సమయంలో రూమ్‌లోనే వంట చేసుకుంటూ ఉంటారు.

స్నేహితులందరూ కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ వంట వండుకుంటారు.ఫ్రెండ్స్ తో కలిసి అలా తమ బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.ఇందులో ఒక బ్యాచిలర్ యువకుడు వంట చేస్తున్న విధానం చూస్తే ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అర్థమవుతుంది.అర్థరాత్రి 12 గంటలకు పాటలు వింటూ నూడుల్స్ చేస్తున్నాడు.పాటలు పెట్టుకుని ఊగిపోతూ, డ్యాన్స్ వేస్తూ నూడుల్స్ లో మసాలాలు కలిపేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.ఇలా డ్యాన్స్ వేస్తూ అర్థరాత్రి మ్యాగీ( Maggie ) చేస్తూ బ్యాచిలర్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.అతడు డ్యాన్స్ చేస్తూ మ్యాగీ చేస్తుండగా రూంలోని స్నేహితుడు తన ఫోన్ లో రికార్డు చేయడం ప్రారంభించాడు.

దీనిని గమనించి యువకుడు మరింతగా రెచ్చిపోయి డ్యాన్స్ వేశాడు.

బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ ( Shah Rukh Khan )నటించిన ఓ శాంతి ఓం సినిమాలోని దర్దే డిస్కో పాటకు ఊగిపోయి డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఈ వీడియో చూస్తే తమ బ్యాచిలర్ లైఫ్ గుర్తుకొస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

బ్యాచిలర్ బాయ్స్ ఉండే రూముల్లో అర్థరాత్రి ఇలాంటివే కనిపిస్తాయంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.బ్యాచిలర్ లైఫ్ అంటే ఇలా ఉంటుందని, అర్థరాత్రి 12 గంటలు దాటినా నూడుల్స్ చేసుకుని తినాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో చూడగానే చాలామందికి తమ బ్యాచిలర్ లైఫ్ గుర్తుకు రాకుండా ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube