“వాల్తేరు వీరయ్య”( Waltair Veerayya ) సినిమా 200 రోజుల వేడుకల ఫంక్షన్ లో చిరంజీవి( Chiranjeevi ) ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.సినిమా నటుల రెమ్యూనరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి.
పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రం గా ఫిల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి.మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధీ అవకాశాల గురించి ఆలోచించాలి.
పేదవారి కడుపు నింపాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) మండిపడ్డారు.దాడి జరిగినప్పుడు ఎదురుదాడి జరుగుతుందని వ్యాఖ్యానించారు.
సినిమా హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడలేదని పేర్కొన్నారు.గిల్లితే గిల్లించుకోవాలి అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశారు.

“బ్రో”( Bro Movie ) ఒరిజినల్ సినిమాలో ఆ పాత్ర లేకపోయినా కావాలనే దురుద్దేశంతో కక్ష తీర్చుకోవాలి అన్నట్టుగా పాత్రలను సృష్టించినప్పుడు ఆరీతిగానే దాడిని ఇటువైపు నుండి కూడా ఎదుర్కోవాలి.రాజకీయాన్ని రాజకీయంలా చూడాలి.సినిమా నటులపై ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా.?, ఒక రాజకీయ నేతపై అనవసరంగా పాత్ర సృష్టించి వివాదం చేసింది ఎవరు అని ప్రశ్నించారు.ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా కృషి చేయాలన్న సినీ నటుడు చిరంజీవి సూచనపై కూడా పేర్ని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక హోదా( AP Special Status ) చట్టంలో పెట్టకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించినపుడు కేంద్ర మంత్రిగా చిరంజీవి ఏం చేశారని పేర్ని నాని నిలదీశారు.







