ప్రజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు( Remake Movies ) బాగా తెరమీదకు వస్తున్నాయి.స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేస్తుండడంతో ఈ అంశం ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
ఇప్పుడు మారిన కాలంలో రీమేక్ సినిమాలు వద్దు.స్ట్రైట్ సినిమాలు మాత్రమే చేయాలని కొంత మంది ఫిక్స్ అయ్యారు.
అలాగే ప్రేక్షకులు కూడా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు.

ఇది వరకులా రీమేక్ సినిమాల వల్ల ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు.అందుకే మన హీరోల మార్కెట్ కూడా తగ్గుతుంది అని కొందరు అంటుంటే చిరంజీవి మాత్రం వరుసగా రీమేక్ సినిమాలనే ఎంచుకుంటున్నాడు.ఇలా కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈయన చేసిన కామెంట్స్ కూడా నిజమే అనేలా ఉన్నాయి.
భోళా శంకర్( Bhola Shankar ) ఈవెంట్ లో ఈయన కొన్ని కామెంట్స్ చేసారు.
ఆ కామెంట్స్ ను బట్టి చిరంజీవి( Chiranjeevi ) చరణ్ ను ఫాలో అవుతున్నారు అని అనిపిస్తుంది.
ఒకానొక సమయంలో చరణ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఇప్పుడు రీమేక్స్ చేసేందుకు ఆసక్తిగా లేనని ఒకవేళ చేయాల్సి వచ్చిన అది తెలుగులో రిలీజ్ కాకుండా ఏ ఓటిటిలో రిలీజ్ కాకుండా ఉండాలని అలా ఉంటేనే రీమేక్ సినిమా చేస్తానని తెలిపాడు.

మరి భోళా ఈవెంట్ లో చిరు కూడా ఇదే సమాధానం చెప్పారు.దీంతో ఈయన తన తనయుడు స్ట్రాటజీ( Ram Charan Strategy )ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.ఒకానొక సమయంలో రీమేక్స్ వద్దు అనుకున్న చిరు ఆ తర్వాత చరణ్ సలహా మేరకే రీమేక్స్ చేస్తున్నట్టు అంటున్నారు.
మొత్తానికి భోళా ఆగస్టు 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.







