ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
ఇవాళ కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగుతోందని సమాచారం.ఈ నెల 11 వరకు బీజేపీ సభ్యులకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది.
ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.కాగా మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార మరియు విపక్షాల మధ్య చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే విపక్షాలన్నీ కలిసి కేంద్రంపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రకటించగా ఇవాళ, రేపు దీనిపై లోక్ సభలో చర్చించనున్నారని సమాచారం.







