పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిషేధిత ప్రాంతంగా మార్చింది..: చంద్రబాబు

టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.2004 నుంచి 2009 వరకు ఐదు శాతం పనులే పూర్తయ్యాయని పేర్కొన్నారు.టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు.

 Ycp Has Turned Polavaram Project Into A Restricted Area..: Chandrababu-TeluguStop.com

వైసీపీ పాలనలో పోలవరం పనులు నాలుగు శాతం మాత్రమే పూర్తి అయ్యాయని చంద్రబాబు విమర్శించారు.

పోలవరంలో 23 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశామన్న చంద్రబాబు 82 సార్లు వర్చువల్ పరిశీలన చేశామన్నారు.సుమారు రెండు కిలోమీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామన్నారు.పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్ రూ.11,537 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు.పోలవరం ఎత్తు 45.72 మీటర్లని టీడీపీ అంటే వైసీపీ 41.15 మీటర్లని అంటోందన్నారు.ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తాము ఉంచితే వైసీపీ ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా చేసిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube