అఫిషియల్ : 'ఖుషి' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.లైగర్ వంటి ప్లాప్ తో కొద్దిగా నిరాశ చెందిన కూడా ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే బౌన్స్ బ్యాక్ అయ్యి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.

 Vijay Devarakonda Khushi Trailer Update, Vijay Devarakonda, Khushi Movie, Samant-TeluguStop.com

మరి రౌడీ స్టార్ విజయ్ నటిస్తున్న మూవీల్లో ‘ఖుషి’( Khushi Movie ) ఒకటి.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే వచ్చిన పాటలతో వీరి కెమిస్ట్రీ ఎంత అందంగా ఉందో చూపించడమే కాకుండా మరిన్ని అంచనాలు పెంచేసాయి.

ఇక ఈ మధ్యనే షూట్ కంప్లీట్ కాగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు కొద్దిసేపటి క్రితం గుడ్ న్యూస్ చెప్పారు.ఆగస్టు 9న ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ పోస్టర్ లో సైతం ఈ జంట కెమిస్ట్రీ ఆకట్టు కుంటుంది.మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.కాగా ట్రైలర్ తో ప్రమోషన్స్ మరింత జోరుగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.ఈ లవ్ స్టోరీ విజయ్ కు సమంతకు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube